News February 26, 2025
తాడేపల్లి: అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు హశిశ్ ఎంపిక.!

తైవాన్‌లో చైనీస్ తైపీ రోలర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 24 నుంచి 30 వరకు జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు, ఇండియా నుంచి తాడేపల్లి దూలాస్ నగర్‌కు చెందిన మేరుగుపాల హశిశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షులు లీయూ పు-త్సాయ్ ఉత్తర్వులను మంగళవారం పంపారు. హశిశ్ ఆర్టిస్ట్ స్కేటింగ్ విభాగంలో ప్రీ స్టైల్, ఇన్ లైన్, సోలో డాన్స్ పోటీలలో తలపడతాడు. కాబట్టి ఈ బుడతడికి కంగ్రాట్స్ చెబుదాం.
Similar News
News February 27, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఎలక్షన్‌కు సర్వం సిద్ధం

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 1,08,109మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. వీరిలో పురుషులు 62,549, మహిళలు 45,542, ఇతరులు 18మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 26, 2025
బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చేనేత పట్టు వస్త్రాలను బహూకరించారు. ప్రతిఏటా ఆనవాయితీగా సారెను సమర్పిస్తున్నారు. ప్రధాన కైంకర్యపరులుగా ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావు, గౌరీ, గుత్తికొండ ధనుంజయరావు,విజయ దంపతులు వ్యవహరించారు. ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి రత్నరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
News February 26, 2025
గుంటూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: DEO

గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.