News April 12, 2025
తాడేపల్లి: ఇంటర్ బాలికల అదృశ్యం.. గుర్తించిన పోలీసులు

ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లను వదిలి వెళ్లిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు గత రాత్రినుంచి కనపడటం లేదని తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ కళ్యాణ్ రాజు టెక్నాలజీ సహాయంతో హైదరాబాదులో వారిని గుర్తించి తాడేపల్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
Similar News
News November 11, 2025
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: కలెక్టర్ తేజస్

సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు పంపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిరుమలగిరి మండలం తొండ, కోక్యా నాయక్ తండా, ఫణిగిరిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత కలిగిన ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించవద్దని సూచించారు.
News November 11, 2025
ఏలూరు: ఈ కోర్సులో చేరేందుకు మెరిట్ లిస్ట్ విడుదల

ఏలూరు: హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సులలో ప్రవేశానికి 2వ ఫేజ్ కౌన్సిలింగ్‌కు మెరిట్ లిస్ట్‌ను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నోటీసు బోర్డులో పొందుపరిచారు. ఈ విషయాన్ని ది వైద్య కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 12న ఉదయం 10 గంటలకు కాలేజీలో వెరిఫికేషన్‌కు మెరిట్ లిస్టులోని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.
News November 11, 2025
విశాఖ కలెక్టరేట్‌లో మైనారిటీ వెల్ఫేర్ డే

అబుల్ కలాం జయంతి పురస్కరించుకొని విశాఖ కలెక్టరేట్ లో జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు.కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ఆనందపురంలో పీకేరు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిలో ముస్లింలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మైనారిటీ సొసైటీ భూములు 22ఏ నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


