News April 12, 2025
తాడేపల్లి: ఇంటర్ బాలికల అదృశ్యం.. గుర్తించిన పోలీసులు

ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లను వదిలి వెళ్లిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు గత రాత్రినుంచి కనపడటం లేదని తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ కళ్యాణ్ రాజు టెక్నాలజీ సహాయంతో హైదరాబాదులో వారిని గుర్తించి తాడేపల్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
Similar News
News April 17, 2025
పాడేరు: హాట్ బజార్స్ నిర్మాణాలపై సమీక్ష

హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు ఆదేశించారు. ఐటీడీఏలో జీసీసీ, వెలుగు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి మండలానికి ఒక మినీ సూపర్ బజార్ మంజూరు అయిందిని తెలిపారు.
News April 17, 2025
జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్ సెషన్ 2 <
News April 17, 2025
నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు