News April 10, 2025

తాడేపల్లి: ఇప్పటంలో విషాదం.. ఇద్దరి చిన్నారుల దుర్మరణం

image

తాడేపల్లి (M) ఇప్పటంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం (D) అద్దంకి నుంచి పనికోసం ఓ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ గోతిలో పడి చనిపోయారు. విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచి బాధిత కుటుంబం, చిన్నారుల మృతదేహాలను అద్దంకికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News February 26, 2026

జనగామ: ఇంటర్ EXAMS.. 76 మంది గైర్హాజరు

image

జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 3,999 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, వారిలో 3,923 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. వివిధ కారణాల వల్ల 76 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News February 26, 2026

NLR: గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా

image

గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.