News March 8, 2025
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఫైర్

నవమాసాల్లో మహిళలకు నవమోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీలతో నమ్మించి, అధికారంలోకి రాగానే మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారితను అందుకున్నారన్నారు.
Similar News
News March 10, 2025
లోక్ అదాలత్ ద్వారా 1,211 కేసులు పరిష్కరించాం: ఎస్పీ

దేశవ్యాప్తంగా నిర్వహించబడిన జాతీయ లోక్ అదాలతో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులను పరిష్కరించామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. ఐపీసీ కేసులు 601, ఎక్సైజ్ కేసులు 473, స్థానిక చట్టాలు సంబంధించిన కేసులు 133 మొత్తం కలిపి 1,211 కేసులను పరిష్కరించామని తెలిపారు. డీసీఆర్బీ సీఐ నరసింహారావు, కోర్టు సిబ్బందిని అభినందించారు.
News March 10, 2025
పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని సోమవారం నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదిదారులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 9, 2025
PGRSలో ఫిర్యాదులు అందించండి : GNT ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఫిర్యాది దారులు ఈ విషయాన్ని గమనించి పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.