News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ విచారం

image

మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్‌, మత ప్రబోదకుడు ప్రవీణ్‌ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రవీణ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News April 2, 2025

బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

image

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్‌టీ‌ఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.

News April 2, 2025

తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

image

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.

News April 2, 2025

వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

image

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.

error: Content is protected !!