News May 12, 2024
తాడేపల్లి: ఫేక్ ఆడియోపై చంద్రబాబు స్పందన

సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ఆడియోపై చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
Similar News
News February 15, 2025
గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతాం: సీఎం

సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో సేవాలాల్‌కు నివాళులర్పించారు. సీఎం మాట్లాడుతూ.. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమాలు అమలు చేశారన్నారు. ఆయన స్పూర్తితో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామన్నారు.
News February 15, 2025
తాడికొండలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తాడికొండ మండల పరిధిలోని బేజాత్ పురం గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి (70) మృతదేహం లభ్యమైంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘటనా స్థలానికి ఎస్ఐ జైత్యా నాయక్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్వో రవిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసినవారు తాడికొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
News February 15, 2025
తెనాలి: కత్తితో దాడి.. వ్యక్తి మృతి

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తెనాలి నాజరుపేటకు చెందిన గొంది బసవయ్యపై ఇస్లాంపేటకు చెందిన జూపల్లి వేణు, అతని స్నేహితుడు రాము కత్తితో గొంతుపై దాడి చేసిన విషయం తెలిసిందే. గత నెల 31న ఈ ఘటన జరుగగా బసవయ్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితుడి మృతితో కేసును హత్య కేసుగా మార్చారు.