News May 19, 2024
తాడ్వాయి: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ
తాడ్వాయిలో ప్రమాదం తప్పింది. పసర నుంచి ఏటూరు నాగారం వైపు వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాద సమయంలో తాడ్వాయిలో వర్షం పడుతుండగా రోడ్డుపైన ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లు తెగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి.
Similar News
News December 11, 2024
వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: పొంగులేటి
వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి బుధవారం వరంగల్ అభివృద్ధిపై మాట్లాడారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News December 11, 2024
గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: జనగామ కలెక్టర్
జనగామ జిల్లాలో గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై కలెక్టర్ అవగాహన సదస్సును నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షకు జిల్లాలో 16 కేంద్రాల్లో 5471 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
News December 11, 2024
నర్సింహులపేట: కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని యువతి సూసైడ్
కొత్త బట్టలు కొనివ్వలేదని యువతి సూసైడ్ చేసుకుంది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాలు.. నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన నాగన్నబోయిన మనీషా(22) బాబాయ్ కుమార్తె వివాహానికి తనకు కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఈ నెల 6న పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.