News March 10, 2025

తాడ్వాయి: ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి: DMHO

image

ఎండాకాలంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ములుగు డీఎంహెచ్వో గోపాలరావు మహిళలకు అవగాహన కల్పించారు. తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రపరిధిలోని కొండపర్తిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడారు. నీటిని ఎక్కువగా తాగాలని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు తలకు రుమాలు, టవళ్లు చుట్టుకోవాలన్నారు. వడదెబ్బకు గురైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు.

Similar News

News November 13, 2025

పెద్దపల్లి: పారామెడికల్ కోర్సులు ప్రవేశానికి దరఖాస్తులు

image

సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RGMలో పారామెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. డీఎంఎల్టీ, డయాలసిస్ టెక్నాలజీ కోర్సుల్లో చెరో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. బైపీసీ విద్యార్థులు అర్హులన్నారు. సీట్లు ఖాళీగా ఉంటే ఎంపీసీ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. వివరాలకు https://tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని పేర్కొన్నారు.

News November 13, 2025

మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

News November 13, 2025

కేంద్ర పథకాల అమలులో పురోగతి కనిపించాలి: కలెక్టర్

image

కేంద్ర పథకాల అమలులో కచ్చితమైన పురోగతి చూపించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కేంద్ర పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లాభం చేకూరే విధంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పథకాల అమలులో పారదర్శకత, వేగం నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.