News March 10, 2025

తాడ్వాయి: ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి: DMHO

image

ఎండాకాలంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ములుగు డీఎంహెచ్వో గోపాలరావు మహిళలకు అవగాహన కల్పించారు. తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రపరిధిలోని కొండపర్తిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడారు. నీటిని ఎక్కువగా తాగాలని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు తలకు రుమాలు, టవళ్లు చుట్టుకోవాలన్నారు. వడదెబ్బకు గురైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు.

Similar News

News March 18, 2025

తిరుపతిలో దాడిపై స్పందించిన ఈసీ

image

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియలో హింస జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎట్టకేలకు స్పందించింది. ఎంపీ గురుమూర్తి చేసిన ఆరోపణలపై తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఈసీ ముఖ్య కార్యదర్శి కేఆర్‌బీ హెచ్ఎన్ చక్రవర్తి లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా చట్ట ఉల్లంఘనలు జరిగాయని, ప్రజాప్రతినిధుల హక్కులను అణచివేశారని ఈసీకి ఎంపీ ఫిర్యాదు చేశారు.

News March 18, 2025

27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

image

AP: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్స్ అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

News March 18, 2025

గవర్నర్‌ను కలిసిన కోనసీమ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ కోరుకొండ సత్యనారాయణ కలిశారు. మంగళవారం విజయవాడలో రెడ్ క్రాస్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు కోనసీమ రెడ్ క్రాస్ ఛైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. కోనసీమలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు.

error: Content is protected !!