News July 11, 2024
తాడ్వాయి: నేను టీచర్ అవుతా: తులసి

తాను బాగా చదువుకొని టీచర్ అవుతానని తక్కల్లగూడెం గుత్తిగూడెం ఆదివాసీ బిడ్డ పూనెం తులసి అంటోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన పాత్రను నేచురల్ చేసినట్లు చెప్పింది. “గూడెంలోని జీవనశైలి, కుటుంబ పోషణ” విధానంపై పాత్ర చేశానని, తనతోపాటు గూడెంలోని పిల్లలందరూ చదువుకోవాలన్న తులసి కోరిక మేరకు ఇటీవల మంత్రి సీతక్కస్కూల్ భవనం నిర్మించి ప్రారంభించారు. తులసి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Similar News
News November 7, 2025
వర్ధన్నపేట: వడ్లు ఆరబెట్టే యంత్రాలను రైతులు వినియోగించుకోవాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డ్రై హెడ్ మిషన్ (వడ్లు అరబెట్టే యంత్రం)లను రైతులు వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సూచించారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. యంత్రాల ద్వారా వడ్లను ఎలా ఆరబెట్టుకోవాలో రైతులకు అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతులపై సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.
News November 7, 2025
వరంగల్: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులతో ఆర్బిట్రేషన్

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా రూపుదిద్దుకుంటున్న 163-జి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్లో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. వర్ధన్నపేట మండలంలోని ఉకల్, బొడ్డు చింతలపల్లి గ్రామాల రైతులతో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి పాల్గొన్నారు.
News November 6, 2025
ముంపు సమస్యపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

వరంగల్ నగరంలో ముంపు సమస్యను శాశ్వతంగా నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గురువారం తెలిపారు. ఆమె బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి చిన్న వడ్డేపల్లి చెరువు, లక్ష్మి గణపతి కాలనీ, ఎల్.బి. నగర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాలను సందర్శించారు. ముంపు పరిస్థితులను దగ్గర నుండి పరిశీలించి, సమస్య పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.


