News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News October 16, 2025
నారాయణపేట: హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్: ఎస్ఐ

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన రుక్కమూల నరసింహులుపై కత్తితో దాడి చేసిన జంజర్ల నరేశ్(25)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 10వ తేదీన “తన కూతురితో ఎందుకు మాట్లాడుతున్నావు” అని నరసింహులు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని జిల్లా జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు SI రమేశ్ తెలిపారు.
News October 16, 2025
వనపర్తిలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

వనపర్తిలోని ఓ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లాకు చెందిన పోతులపాడు సంజీవ (16) వనపర్తిలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈనెల 10న మధ్యాహ్నం కాలేజీ నుంచి ఆ విద్యార్థి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.
News October 16, 2025
గద్వాల: కరెంట్ షాక్‌తో మహిళ మృతి

గద్వాల పట్టణంలోని బీసీ కాలనీలో దుర్గమ్మ (30) అనే మహిళ కరెంట్ షాక్‌తో బుధవారం మృతిచెందిందని స్థానికులు తెలిపారు. భర్త ఎల్లప్పతో కలిసి దుర్గమ్మ గతంలో నంద్యాల నుంచి గద్వాలకు బతుకుదెరువు నిమిత్తం వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.