News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News January 15, 2026
కామారెడ్డి: గాలిపటాల జోష్.. రోడ్లపై డెత్ రేస్!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. అయితే, ఈ సరదా కాస్తా ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తోంది. గాలిపటం తెగిపోగానే దానిని పట్టుకోవాలనే తాపత్రయంతో చిన్నారులు ప్రాణాలకు తెగించి రోడ్ల వెంట పరుగు పెడుతున్నారు. పండుగ పూట విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ వాసులు మీ పిల్లలు జాగ్రత్త.
News January 15, 2026
HYD: ఇక ట్యాంక్‌బండ్ చెత్తరహితం

నగర శోభకు ప్రతీకగా ఉన్న ట్యాంక్‌బండ్ ను చెత్తరహితంగా మార్చేందుకు HMDA కీలక నిర్ణయం తీసుకుంది. సరైన ఫలితాలు ఇవ్వని తాత్కాలిక క్లీనింగ్‌కు ముగింపు పలుకుతూ, మూడేళ్లపాటు వ్యర్థాల తొలగింపును 2 సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైంది. సాగరాన్ని 2 సెక్టార్లుగా విభజించి కార్మికులు, బోట్లు వినియోగించి లోపల, బయట చెత్తను తొలగించనున్నారు. ఇందుకు రూ.7.11 కోట్లు ఖర్చుచేయనున్నారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు.
News January 15, 2026
చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి ఈ-ఆఫీస్

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 98 ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా జరిగేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


