News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News November 1, 2025
తిరుమల కొండపై విశేష పర్వదినాలు

నవంబర్ 1: ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ
నవంబర్ 9: కార్తీక వన భోజనం
నవంబర్ 15: సర్వ ఏకాదశి
నవంబర్ 17: ధన్వంతరి జయంతి
నవంబర్ 18: మాస శివరాత్రి
నవంబర్ 25: తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం
News November 1, 2025
DRDOలో 105 పోస్టులు.. అప్లై చేశారా?

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు NOV 4లోపు అప్లై చేసుకోవాలి. apprenticeshipindia.gov.in పోర్టల్ ఎన్రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in/
News November 1, 2025
మూగజీవాలకు కష్టాలు.. నట్టల మందుల సరఫరా నిలిపివేత

నల్గొండ జిల్లాలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాపరులు ప్రైవేటుపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు అంచనా. స్టాక్ త్వరలో వస్తుందని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని ఏడీ రమేష్ బాబు తెలిపారు.


