News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News February 10, 2025
శ్రీకాకుళంలో పెరుగుతున్న Water Melon విక్రయాలు

శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి నుండే వేసవిని తలపించే విధంగా భానుడు ప్రభావం చూపుతుండటంతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో వాటర్ మిలాన్, పండ్లు, జ్యూస్ షాపుల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ మిలాన్ విక్రయాలు జోరందుకున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
News February 10, 2025
మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి!

కర్నూలు జిల్లా పరిధిలోని గీత కులాలకు సంబంధించి 10 మద్యం షాపులకు మొత్తం 133 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తులను జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారుల పరిశీలన అనంతరం సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నవ్య లాటరీ పద్ధతిలో కేటాయించారు. 10 షాపులు దక్కించుకున్న వారి పేర్లను ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
News February 10, 2025
రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం: పవన్

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.