News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News November 6, 2025
కృష్ణా: ఇకపై విజన్ యూనిట్లుగా సచివాలయాలు

గ్రామ/వార్డు సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్లుగా మారనున్నాయి. సచివాలయాల పేర్లు మారుస్తున్నట్లు గురువారం జరిగిన మంత్రులు, HODలు, సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ విజన్ యూనిట్లుగా పని చేయనున్నాయి.
News November 6, 2025
పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్లో యువకుడి ఆత్మహత్య

కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నీరటి రాజు (31) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం అలవాటు కారణంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని, బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన రాజు గురువారం ఉదయం తిరిగొచ్చి ఇంట్లో ఉరివేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
News November 6, 2025
NZB: కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయండి: DRDO

జిల్లాల్లో కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని NZB DRDO సాయాగౌడ్ ఆదేశించారు. గురువారం NZB కలెక్టరేట్లో NZB, KMR, ADB, MDK, నిర్మల్ జిల్లాల DPM, DAPMలకు హెల్త్ అండ్ న్యూట్రీషియన్, బాలికల సంఘాల ఏర్పాటు అంశాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు.. కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి వారికి మండల, గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్, ANMలతో సమన్వయం చేయాలని సూచించారు.


