News August 22, 2024

తాడ్వాయి: బస్సుల కోసం రోడ్డుపై రాస్తారోకో చేసిన విద్యార్థులు

image

తాడ్వాయి మండలంలో బస్సుల కొరత, సమయానికి సరిపడా బస్సులు రాక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఉదయం వచ్చే బస్సులు సైతం రద్దిగా ఉండడంతో అర్గోండ గ్రామానికి చెందిన విద్యార్థులకు కామారెడ్డికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 

Similar News

News September 11, 2024

బోధన్: శ్యామ్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

image

వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి తండ్రి శ్యామ్ రావు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం బోధన్ మండలం బెల్లాల్ గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరై పాడెను మోశారు. శ్యామ్ రావు అకాల మరణం పట్ల ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియలో మాదిగ సంఘ నాయకులు పాల్గొన్నారు.

News September 10, 2024

కామారెడ్డి: అష్టావధాని ఆయాచితం నటేశ్వరశర్మ కన్నుమూత

image

ప్రఖ్యాత కవి,అష్టావధాని డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రామారెడ్డి మండలానికి చెందిన నటేశ్వర శర్మ సంస్కృతంలో 50కి పైగా రచనలు రాశారు. డాక్టర్ నటేశ్వర శర్మ రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ నటేశ్వర శర్మ కన్నుమూయడంతో కవులు, కళాకారులు శోక సముద్రంలో మునిగారు.

News September 10, 2024

జక్రాన్‌పల్లి: చోరీకి గురైన శివలింగం

image

నూతనంగా నిర్మించనున్న శివాలయం స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మండలంలోని మునిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్మించనున్న గుడి స్థలంలో ప్రతిష్ఠించిన శివలింగం చోరీకి గురైనట్లు స్థానికులు కాలనీవాసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.