News February 16, 2025

తాత్కాలికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విరామం ప్రకటించామని కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం తెలిపారు. ఈ నెల మూడో తేదీ నుంచి మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, మూడు రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.

Similar News

News December 3, 2025

నర్సంపేటకు వరాల జల్లు..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ఈ నెల 5న నర్సంపేట పర్యటనకు రానున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానం మేరకు సీఎం ఈ పర్యటనలో పాల్గొని దాదాపు రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.45 కోట్లతో నర్సింగ్ కాలేజీ, రూ.20 కోట్లతో సైడ్ డ్రైనేజీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

News December 3, 2025

మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

image

టీమ్‌‌‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.

News December 3, 2025

మెదక్: పల్లెల్లో జోరుగా ఎన్నికల దావత్‌లు

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఈసారి గతంలో కంటే భిన్నంగా ప్రచార పర్వం ప్రారంభమైంది. తెల్లవారుజామునే ప్రచారాలు మొదలు పెట్టి, చీకటి పడగానే దావత్‌లు జోరుగా సాగుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో చుక్క- ముక్కతో వివిధ వర్గాల వారీగా విందులు ఇస్తున్నారు. ఎన్నికల దావత్‌లు కొత్త వ్యాపారులకుకిక్ ఇస్తున్నాయి.