News March 19, 2025
తానా మహాసభలకు మంత్రి సవితకు ఆహ్వానం

అమెరికాలోని మిచిగన్‌లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు మంత్రి ఎస్. సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడ్రోజులపాటు, తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలు

*బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లాడు. *ఆ టైంలో బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. *మంటలను ఫైర్ సేఫ్టీ కిట్‌తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నంతో వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. *లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. *అర్ధరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం.
News October 24, 2025
భద్రాద్రిలో ముగిసిన మద్యం టెండర్లు.. 3,922 దరఖాస్తులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. జిల్లాలోని 88 దుకాణాలకుగాను చివరి రోజున 106 దరఖాస్తులు రాగా, మొత్తం దరఖాస్తుల సంఖ్య 3,922కు చేరినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన కొత్తగూడెం క్లబ్‌లో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
News October 24, 2025
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం: కర్నూలు ఎస్పీ

కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో <<18087411>>పరారైన<<>> డ్రైవర్, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, NDRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. రాత్రి 10.30 గంటలకు బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరిందని, తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ప్రమాదం జరిగిందని చెప్పారు.


