News March 19, 2025
తానా మహాసభలకు మంత్రి సవితకు ఆహ్వానం

అమెరికాలోని మిచిగన్‌లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు మంత్రి ఎస్. సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడ్రోజులపాటు, తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
News April 19, 2025
వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడకూడదు: హైకోర్టు

వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించిన అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మహాభారత కాలంలోలాగా భార్యను భర్త ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. కాగా తన భార్య మరో వ్యక్తితో హోటల్‌లో శారీరకంగా దగ్గరైందని, వారిని శిక్షించాలని భర్త మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
News April 19, 2025
బీచ్ ఫెస్టివల్‌లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్‌లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.