News February 24, 2025

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

image

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్‌పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.

Similar News

News November 6, 2025

ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

image

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.

News November 6, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News November 6, 2025

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

image

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం ఆయన సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్ బాక్స్‌లను స్వయంగా తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కిట్ ఆర్టికల్స్ నిర్వహణలో పరిశుభ్రత, శ్రద్ధ కనబరిచిన కానిస్టేబుల్ జితేందర్‌కు అభినందించి రివార్డును మంజూరు చేశారు.