News April 10, 2024
తానూర్‌లో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
తానూర్ మండల కేంద్రానికి చెందిన అవదూత్వార్ లచ్చిరాం(59) చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. ఎస్‌ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చిరాం గత కొన్ని రోజులుగా బోదకాలు వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో పాటు తన కాలికి సర్జరీ అయ్యింది. దీంతో ఆ నొప్పులు భరించలేక బుధవారం వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య గంగాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2024
చెన్నూరు: ‘బొగ్గు వేలం రద్దుచేసి సింగరేణికే కేటాయించాలి’
బొగ్గు బ్లాక్‌ల వేలం పాట రద్దు చేసి సింగరేణి సంస్థకే బ్లాక్‌లను కేటాయించాలని చెన్నూరులో CPMఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఏరియా కార్యదర్శి చందు, జిల్లా నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ..మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJPప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్వహిస్తోందన్నారు.
News November 17, 2024
బీర్సాయిపేట్: ‘రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి’
ఉట్నూరు మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో బీర్సాయిపేట్, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్సాయిపేట్ అటవీశాఖ అధికారులు కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో పెద్దపులి సంచార సమాచారం ఉందన్నారు. బీర్సాయిపేట్, పరిసర గ్రామాలతో పాటు నార్నూర్,జైనూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పులికి ఏ హాని తలపెట్టవద్దని, నష్టం జరిగితే అటవీశాఖ నష్టపరిహారం ఇస్తుందన్నారు.
News November 17, 2024
మందమర్రిలో కనిపించిన పెద్దపులి
మందమర్రిలోని శంకరపల్లి, KK 5 గని సమీపంలో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. కొద్దిరోజులుగా జన్నారం, కాసిపేట, చెన్నూర్, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వలస కూలీలకు శంకరపల్లి వద్ద పులి కనిపించినట్లు తెలిపారు. శంకరంపల్లి సమీపంలో గుడారాల్లో ఉంటున్న తమ వైపు పెద్ద పులి వచ్చిందన్నారు. గుడారాల్లోని వారందరూ భారీగా కేకలు వేయడంతో అది శతలాపూర్ వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు.