News February 12, 2025
తానూర్: రూ.5.70లక్షల నగదు పట్టివేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739331346636_50048514-normal-WIFI.webp)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తానూర్ మండల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రూ.5.70లక్షల నగదు సాధనం చేసుకున్నట్లు ఏఎస్ఐ శ్యాముల్ తెలిపారు. కరీంనగర్ నుంచి మహారాష్ట్రలోని బోకర్‌కు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు వెల్లడించారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు.
Similar News
News February 12, 2025
HYDలో ఉరేసుకున్న తూ.గో యువకుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368089688_1152-normal-WIFI.webp)
ఉప్పలగుప్తంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కొర్లపాటి శేషురావు (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన మంగళవారం జరిగింది. అద్దెకుంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. శేషురావు మృతదేహాన్ని ఉప్పలగుప్తం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
News February 12, 2025
బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364410360_20574997-normal-WIFI.webp)
బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికం తెలంగాణలోని ఏకైక సరస్వతి దేవాలయం బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. వీరితో ఎంపీ గోడం నగేశ్ ఉన్నారు.
News February 12, 2025
సర్కారు బడిలో సార్ బిడ్డ..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739366116351_20560214-normal-WIFI.webp)
సర్కారు బడి బలోపేతం కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు ఈ టీచర్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకి చెందిన నర్సింగ్ నరేశ్ పాలకీడు ZPHS తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నర్సింగ్ నేహాను కీతవారిగూడెం ZPHSలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌ల కాంప్లెక్స్ మీటింగ్ కీతవారిగూడెంలో నిర్వహించగా ఈ విషయం తెలియడంతో HM సువర్ణ, టీచర్లు నరేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.