News March 26, 2025

తాపేశ్వరం సురుచి మల్లిబాబును కలిసిన కమెడియన్ అనంత్

image

రాజాబాబు తమ్ముడు, సినీ కమెడియన్ అనంత్ మంగళవారం తాపేశ్వరం సురుచి అధినేత మల్లిబాబును రాజమహేంద్రవరం దానవాయిపేట సురుచి బ్రాంచ్ వద్ద కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు సురుచి అధినేత శ్రీమల్లిబాబుతో ముచ్చటించారు. ఆ సమీపంలోనే తమ స్వగృహం ఉందని ఆయన చెప్పారు. ఆయన అన్న రాజబాబు స్ఫూర్తితో అనంత్ 500 సినిమాలలో నటించారు.

Similar News

News November 14, 2025

జిల్లా ప్రజలకు సురక్షిత నీటిని అందించాలి : కలెక్టర్

image

గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్దేశిత సమయంలో శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారుల ఆదేశించారు. జాతీయ రహదారి పై వరద నీటి డ్రైయిన్ల నిర్మాణం, నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంక్ ల క్లీనింగ్ పై అధికారులు, కమిటీ సభ్యులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 14, 2025

NGKL: మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

image

జిల్లాలో మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 23న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మెరిట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. హాల్ టికెట్లు ఈనెల 15 నుంచి జారీ చేస్తామన్నారు.

News November 14, 2025

పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలి

image

జిల్లాలో పెద్ద ఎత్తున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని జేసి రాహుల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంస్థలలో స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించాలన్నారు. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా అంతట విస్తృతంగా నిర్వహించాలన్నారు.