News March 29, 2025
తారువలో వడదెబ్బతో మహిళ మృతి

వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం దేవరాపల్లి మండలం తారువ గ్రామంలో చోటుచేసుకుంది. తారువ గ్రామానికి చెందిన కిల్లి కాసమ్మ (59) తన పొలంలో పనులు చేస్తుండగా ఉదయం 11:30 ప్రాంతంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వడ దెబ్బకు గురై ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. 108లో కె.కోటపాడు ఆసుపత్రికి తీసుకెళ్లగా స్థానిక వైద్యులు వైద్య పరీక్షలు చేసి మృతి చెందినట్లు నిర్ధారించారని కుటుంబీకులు తెలిపారు.
Similar News
News October 25, 2025
కార్తిక మాసంలో ఏరోజు పవిత్రమైనది?

కార్తీక మాసంలో ప్రతి దినం భగవత్ చింతనకు శ్రేష్ఠమైనదే. అయితే కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, రుద్రాభిషేకం చేసేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట, ఉసిరి చెట్టును పూజించడం శుభాలకు మూలం. కార్తీక పౌర్ణమి ఈ మాసానికి శిఖరాయమానం. ఈ రోజున చేసే నదీ స్నానం, దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహం లభించి, జన్మజన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
News October 25, 2025
GNT: ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే పండుగ

నాగులచవితి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం. ఈరోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు తొలగి కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఉంది. ఆడవారు ఉపవాసం ఉండి పాలు, పండ్లు, పువ్వులతో నాగదేవతను ఆరాధిస్తారు. రైతులు పంటల రక్షణ కోసం, గృహిణులు కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇది ప్రకృతి, జీవజాలాల పట్ల కృతజ్ఞత తెలిపే పండుగగా భావిస్తారు.
News October 25, 2025
నా కొడుకు వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దరామయ్య

తన రాజకీయ జీవితంపై కొడుకు యతీంద్ర చేసిన <<18075196>>వ్యాఖ్యలను<<>> వక్రీకరించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాబోయే సీఎం ఎవరనే విషయమై కాకుండా విలువల గురించి తన కొడుకు మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై తాను ఇప్పుడే స్పందించనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతానని చెప్పారు.


