News July 21, 2024
తాలుపేరు ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని ఉన్న తాలి పేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్లు మొత్తం ఎత్తి 55,232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 52,897 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం నుంచి వరదనీరు భారీగా వస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 20, 2025
ఖమ్మంలో 8 మిల్లులకు ధాన్యం ఇవ్వబోం: అ.కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 71మిల్లుల్లో 63మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని, మిగిలిన 8మిల్లులకు ధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేసిన తర్వాతే కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
News November 20, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 20, 2025
తండ్రి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి

ఖమ్మం కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తన భార్య సాయి వాణిని భర్త భాస్కర్ అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా మొదట తన కన్న కూతురిని చంపేందుకు భాస్కర్ ప్రయత్నించగా అతడి నుంచి చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ దాడి ఘటనలో చిన్నారి మూడు వేళ్లు తెగిపోయాయని స్థానికులు తెలిపారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


