News April 5, 2024

తాళ్లపల్లి : విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన శీలం శ్రీను (50) ఉదయాన్నే రైట్ కెనాల్ పక్కనే ఉన్న మరసకుంట వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పొలానికి నీరు పెట్టే విద్యుత్ మోటారు వైరు తగిలి కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 25, 2025

తెనాలి అనగానే… ఆ పేరు చెప్పక తప్పదు

image

తెనాలి పట్టణం సాహిత్యం, సంగీతం, నాటకం, చిత్రకళ, శిల్పకళల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతిభావంతులైన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గౌరవాలు అందుకుంటున్నారు. ప్రతి వీధిలోనూ సృజనాత్మకత ప్రతిధ్వనిస్తుంటే, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తెనాలి పేరు వినగానే “కళా కాణాచి” అనిపించుకోవడం ఆనవాయితీ.
@నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

News October 25, 2025

GNT: ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే పండుగ

image

నాగులచవితి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం. ఈరోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు తొలగి కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఉంది. ఆడవారు ఉపవాసం ఉండి పాలు, పండ్లు, పువ్వులతో నాగదేవతను ఆరాధిస్తారు. రైతులు పంటల రక్షణ కోసం, గృహిణులు కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇది ప్రకృతి, జీవజాలాల పట్ల కృతజ్ఞత తెలిపే పండుగగా భావిస్తారు.

News October 25, 2025

అవాస్తవ, ద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవ ప్రచారాలు, ద్వేషపూరిత పోస్టులు, వీడియోలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం జూమ్ ద్వారా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, విదేశాల్లో ఉన్న నిందితులపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద పోస్టులు గమనిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.