News February 26, 2025
తాళ్లపూడి: గల్లంతై చనిపోయింది వీరే..!

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం పండగ రోజు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నదీ స్నానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతై చనిపోయారు. మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. 20 సంవత్సరాలు దాటకుండానే ఆ యువకులు చనిపోయారు. మృతదేహాల వద్ద వారి కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఆల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
Similar News
News March 21, 2025
బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని సింగర్ మనోను కోరిన కలెక్టర్

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకులు (మనో)నాగుర్ బాబు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యలో ఆయన కలెక్టర్ ను కలిశారు. వారిరువురూ 10 నిమిషాల పాటు జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు.
News March 21, 2025
జగిత్యాల: పది పరీక్షలకు 12 మంది విద్యార్థులు గైర్హాజరు

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా మొదటి రోజు తెలుగు పేపర్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 11838 విద్యార్థులకు11826 విద్యార్థులు హాజరై.. 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యూలర్ విద్యార్థుల హాజరు శాతం 99.90% సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 31 విద్యార్థులకు 25 మంది విద్యార్థులు హాజరు అయ్యారని అధికారులు తెలిపారు.
News March 21, 2025
ATP: శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్ష: ఎస్పీ

ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం తామున్న ప్లేస్‌కి చేరుకొని రక్షిస్తుందన్నారు.