News April 6, 2024

తాళ్లపూడి: లోయలో పడ్డ యాసిడ్ ట్యాంకర్

image

తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది‌. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.

Similar News

News January 16, 2025

ప.గో: పందెంలో మీకు ఏం వచ్చింది?

image

గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కొందరు లాభ పడగా.. మరికొందరు ఎంతో నష్టపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కార్లను సైతం కుదవ పెట్టేశారట. కొందరు నెల జీతం మొత్తాన్ని క్షణాల్లో పోగొట్టేసుకున్నారు. మరికొందరు స్థలాలను సైతం తాకట్టు పెట్టేశారు. మీ పరిధిలో ఎవరైనా ఇలా నష్టపోయారా? లాభపడ్డారా? తెలిస్తే కామెంట్ చేయండి.

News January 16, 2025

మొగల్తూరులో కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు

image

మొగల్తూరులో బుధవారం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియ, గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌లకు గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు.  వైష్ణవ్‌కు 200 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.

News January 16, 2025

ప.గో: మూడు రోజులు…రూ.1000 కోట్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందాలు కూడా ముగిశాయి. ఈసారి కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. మొత్తం 3 రోజులుగా కోడిపందాలు, గుండాట, పేకాట మొత్తం కలిపి సుమారు రూ.1000 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.