News January 27, 2025
తాళ్లరేవు: చనిపోయి మరో ఇద్దరికి చూపునిచ్చిన మహిళ

ప్రముఖ దినపత్రికలో తాళ్లరేవు మండల విలేకరిగా వూడా వెంకటరమణ పనిచేస్తున్నారు. ఆయన సతీమణి హేమవతి(45) ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు వెంకటరమణ తన శ్రీమతి నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానమిచ్చారు. చనిపోయి ఆమె ఇద్దరికి చూపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అభినందించారు. సతీ వియోగంతో బాధపడుతున్న విలేకరి వెంకటరమణను తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు.
Similar News
News October 28, 2025
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై CBN భేటీ

AP: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో CM CBN సమీక్ష చేపట్టారు. గతంలో జరిగిన అశాస్త్రీయ విభజనతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. పునర్విభజనలో ప్రస్తుత కొన్ని జిల్లాల భౌగోళిక సరిహద్దులను మార్పు చేయనున్నారు. నేతలు, సంఘాల వినతి మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. Dy CM పవన్ కళ్యాణ్, మంత్రులు భేటీలో పాల్గొన్నారు.
News October 28, 2025
మునగ సాగు.. ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 28, 2025
ఎర్రమరెడ్డిపాలెం చెరువును పరిశీలించిన కలెక్టర్

కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సిబ్బందితో డిస్ట్రిక్ స్పెషల్ ఆఫీసర్ పి.అరుణ్ బాబు, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సమావేశమయ్యారు. అనంతరం రేణిగుంట సమీపంలోని ఎర్రమ రెడ్డి పాళెం చెరువును పరిశీలించారు. మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


