News January 27, 2025
తాళ్లరేవు: చనిపోయి మరో ఇద్దరికి చూపునిచ్చిన మహిళ

ప్రముఖ దినపత్రికలో తాళ్లరేవు మండల విలేకరిగా వూడా వెంకటరమణ పనిచేస్తున్నారు. ఆయన సతీమణి హేమవతి(45) ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు వెంకటరమణ తన శ్రీమతి నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానమిచ్చారు. చనిపోయి ఆమె ఇద్దరికి చూపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అభినందించారు. సతీ వియోగంతో బాధపడుతున్న విలేకరి వెంకటరమణను తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు.
Similar News
News February 8, 2025
7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.
News February 8, 2025
MBNR: మన్యంకొండ గుట్టపైకి ఉత్సాహమూర్తి పల్లకి సేవ.!

శ్రీమన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కోట కదిర గ్రామంలోని అళహరి వంశీయుల ఇంటి నుంచి స్వామివారి ఉత్సవ మూర్తి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని కోటకదిర గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పల్లకి సేవలో పాల్గొన్నారు. రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా నిర్వహిస్తారు. ఆలయ ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News February 8, 2025
హన్మకొండ జిల్లాలో టాప్ న్యూస్ 2/2

* KUలో ఉద్రిక్తత.. చితకబాదుకున్న విద్యార్థులు!
* పరకాలలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన పీడీఎస్ బియ్యం
* త్యాగరాజ కీర్తనలు పాడిన HNK కలెక్టర్ ప్రావీణ్య
* ఉప్పల్‌లో మూడో రోజు కొనసాగిన ఆందోళన!
* పర్వతగిరి: ఖాళీ అవుతున్న చెక్ డ్యామ్‌లు.. పట్టించుకోండి!
* హనుమకొండలో ACB సోదాలు
* విద్యార్థులతో కలిసి భోజనం చేసిన HNK కలెక్టర్