News February 10, 2025
తాళ్లరేవు: 119 మంది అరెస్ట్.. రూ.9లక్షలు స్వాధీనం

తాళ్లరేవు మండలం వేమవరం సమీపంలో కోడిపందేలు నిర్వహిస్తున్న శిబిరంపై ఆదివారం రాత్రి కోరంగి ఎస్ఐ సత్యనారాయణరెడ్డి బృందం దాడులు చేసింది. కోడిపందేలు నిర్వహిస్తున్న 119 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి తొమ్మిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం, పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.
Similar News
News November 7, 2025
లక్ష్యాలు పూర్తిచేయని అధికారులపై చర్యలు: కలెక్టర్

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని అధికారులను ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ వెట్రిసెల్వి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను హెచ్చరించారు. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పర్యాటక శాఖకు చెందిన ప్రదేశాలలో టాయిలెట్ల నిర్మాణ పనులపై ఆర్ డబ్ల్యూ ఎస్, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
News November 7, 2025
BREAKING: వికారాబాద్ జిల్లాలో దారుణం

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ సీఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం మర్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వహేద్, అదే గ్రామానికి చెందిన బాలికను హాస్టల్లో దింపేందుకు తీసుకెళ్లాడన్నారు. మోమిన్పేట్ మండలం దేవరంపల్లి అడవిలో మరో వ్యక్తి నర్సింహులు సహకారంతో అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. వారిని అరెస్ట్ చేశారు.
News November 7, 2025
ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్ను రూపొందించింది.


