News February 10, 2025
తాళ్లరేవు: 119 మంది అరెస్ట్.. రూ.9లక్షలు స్వాధీనం

తాళ్లరేవు మండలం వేమవరం సమీపంలో కోడిపందేలు నిర్వహిస్తున్న శిబిరంపై ఆదివారం రాత్రి కోరంగి ఎస్ఐ సత్యనారాయణరెడ్డి బృందం దాడులు చేసింది. కోడిపందేలు నిర్వహిస్తున్న 119 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి తొమ్మిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం, పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.
Similar News
News February 8, 2026
NGKL: ఈ నెల 14 నుంచి బౌరాపూర్ జాతర

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని బౌరాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి జాతరకు ఫిబ్రవరి 14 తేదీ నుంచి మూడు రోజుల పాటు అనుమతి ఇస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జాతర పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఉంటుందన్నారు. భక్తులు అడవిలోకి ప్లాస్టిక్ వస్తువులు, మంట వస్తువులు, అధిక శబ్దాలు చేస్తూ అడవి జంతువులకు ఇబ్బంది కల్గించవద్దని సూచించారు.
News February 8, 2026
తిరుమలలో వివాహానికి నో ఫీజ్.!

తిరుమల శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ఆధ్వర్యంలో వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర పూజా కార్యక్రమాలు తక్కువ రుసుములతో నిర్వహిస్తున్నారు. వివాహం ఉచితం కాగా, ఇతర సేవలకు రూ.50 నుంచి రూ.300 వరకు ఫీజులు నిర్ణయించారు. భక్తులు కళ్యాణ వేదికలో సంప్రదించి సేవలు పొందవచ్చు.
News February 8, 2026
కృష్ణా జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎదురుదెబ్బ..!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారింది. మైలవరం, కంచికచర్ల సహా 4 మండలాల్లోని 18 గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. మార్కెట్ ధర చెల్లించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. గత జూన్ నుంచి 3,300 ఎకరాలను నోటిఫై కింద ఉంచడంతో.. ఆస్తుల బదలాయింపులు, పిల్లల పెళ్లిళ్లకు భూమి అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


