News December 23, 2024

తాళ్లూరులో మళ్లీ కంపించిన భూమి

image

తాళ్లూరు మండలంలో సోమవారం‌ రాత్రి 8 గంటల సమయంలో పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఒకే రోజు మూడు సార్లు భూకంపం‌ రావడం, మూడు రోజుల నుంచి రోజూ భూమి కంపించడం గమనార్హం.

Similar News

News January 16, 2025

పాకల ఘటన దురదృష్టకరం: S.P ఏ.ఆర్ దామోదర్

image

పాకల బీచ్‌లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న జిల్లా S.P ఏ.ఆర్ దామోదర్, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బీచ్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుడు మాధవ సతీమణి నవ్య (21)ను సురక్షితంగా కాపాడగలిగామని S.P తెలియజేశారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

News January 16, 2025

ఏపీఐఐసీ ఎండీ టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్

image

ఇండస్ట్రియల్ నోడ్స్ అభివృద్ధికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం మంగళగిరి నుంచి ఆయనడి జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌గా సమావేశమై ఇండస్ట్రియల్ నోడ్స్ అభివృద్ధికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పై జిల్లాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ పాల్గొన్నారు.

News January 16, 2025

అధికారులకు ప్రకాశం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.