News July 18, 2024
తాళ్లూరు: బావిలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన మేడగం చంద్రశేఖరరెడ్డి(21) బుధవారం కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖరరెడ్డి పంజాబ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవు నిమిత్తం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో పొలం వద్ద బావిలో నీరు తాగేందుకు దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!