News March 25, 2024

తిప్పర్తి: అంతుచిక్కని జ్వరాలు

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డల గూడెంను అంతుచిక్కని జ్వరాలు వణికిస్తున్నాయి. గ్రామంలో సగం మంది హాస్పిటళ్లలో చేరుతున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒకరు అనారోగ్యంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 2 నెలలుగా స్థానికంగా ఫీవర్ క్యాంపు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని ఇప్పటికే జిల్లా, రాష్ట్ర వైద్యం బృందం పరిశీలించారు.

Similar News

News December 3, 2025

నల్గొండ: డీసీసీ ప్రెసిడెంట్‌గా నియామకపత్రం అందుకున్న పున్న కైలాశ్

image

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌గా పున్న కైలాశ్ నేత నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News December 3, 2025

NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

News December 2, 2025

నియామక పత్రం అందుకున్న పున్న కైలాష్ నేత

image

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌ పున్న కైలాష్ నేత మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చనగాని దయాకర్, దైద రవీందర్ పాల్గొన్నారు.