News April 17, 2024
తిమ్మాజిపేట: కారుతో ఢీకొట్టి.. కర్రలతో దాడి
తిమ్మాజిపేట మండలం గోరిటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండీ మతీన్, ఎండి అఫీజ్‌ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణ రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 11, 2024
MBNR: తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు
కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. పాలమూరు జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో గడిచిన 12 నెలల్లో 930 ఆత్మహత్యకు పాల్పడ్డారంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
News September 11, 2024
MBNR: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే
పాలమూరు జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌లు ఉన్నాయి. SHARE IT
News September 11, 2024
MBNR: విషాదం.. దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం
దొంగతనానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మిడ్జిల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోయిన్‌పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో యాజమాన్యం కంచెకు విద్యుత్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.