News November 16, 2024
తిమ్మాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తాడూరి వెంకట్ రెడ్డి నడుపుతున్న కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు బిహారి కూలీలను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వెంకటరెడ్డికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 11, 2024
KNR: గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.
News December 11, 2024
సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ
సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12 నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
News December 11, 2024
ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో రైతు మృతి
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రైతు చిందు శంకర్ (50) వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. శంకర్‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు.