News January 24, 2025
తిమ్మాపూర్.. రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు

ఎల్లారెడ్డిపేట(M) తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద అశోకలేలాండ్ వాహనం బైక్ను ఢీకొట్టింది. స్థానికుల ప్రకారం.. గురువారం రాత్రి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మూడవత్ హీకనా(55) ఎక్సెల్ వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని అశోక్లేలాండ్ వాహనం అతివేగంతో ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హీకనాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.
News December 5, 2025
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పరిటాల సునీత

అనంతపురం రూరల్ సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్కు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అనుకూలంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసిందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
News December 5, 2025
వరంగల్, హనుమకొండ కలయికపై చర్చ ఉంటుందా?

నర్సంపేట పర్యటనలో CM రేవంత్ రెడ్డి హనుమకొండ-వరంగల్ జిల్లాల కలయికపై స్పందిస్తారా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలను గ్రేటర్ పరిధిలో సమన్వయంగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేయగా.. ఆ మధ్య కాలంలో కలయిక ఉంటుందని భావించారు. సదుపాయాలు, రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ సేవలను ఒకే వ్యూహంతో ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని CM చెప్పొచ్చని రాజకీయ వర్గాల అంచనా.


