News January 24, 2025
తిమ్మాపూర్.. రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు

ఎల్లారెడ్డిపేట(M) తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద అశోకలేలాండ్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. స్థానికుల ప్రకారం.. గురువారం రాత్రి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మూడవత్ హీకనా(55) ఎక్సెల్ వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని అశోక్‌లేలాండ్ వాహనం అతివేగంతో ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హీకనాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
ఎలమంచిలిలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలు

ఎలమంచిలి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 20వ తేదీన జిల్లా హాకీ జట్టు సీనియర్ పురుషుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారి నరేశ్ మంగళవారం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎంపిక పోటీలు జరుగుతాయని అన్నారు. ఎంపికైన వారు వచ్చే నెల గుంటూరులో జరిగే పోటీలో పాల్గొంటారని అన్నారు.
News February 18, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.