News September 27, 2024
తిమ్మాపూర్: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వారితో పాటు ఉపాధ్యాక్షుడు నీలం సుదర్శన్, నాయకులు గొల్ల లక్ష్మణ్, గడ్డం రమేష్, బొజ్జ పర్శయ్య తదితరులున్నారు.
Similar News
News October 5, 2024
కాటారం:అరుదైన అటవీ జంతువును తరలిస్తున్న ముఠా పట్టివేత?
అటవీ జంతువుల్లో అరుదుగా లభించే ‘అలుగు’ను తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం మేరకు అలుగును తరలిస్తున్న ముఠాను కాటారం మండలం మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయసమాచారం. ఈముఠాలో కాటారం సబ్ డివిజన్‌కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, మరో ఇద్దరూ ఉన్నట్లు తెలిసింది. కాగా సదరు అలుగు విలువ రూ. 70లక్షల నుంచి రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం.
News October 4, 2024
లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు నమోదు: చందుర్తి CI
బహమతుల ఆశ చూపెడుతూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుర్గమ్మ విగ్రహాల వద్ద లయన్స్ యూత్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల వద్ద నుంచి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ రూ.99 వసూలు చేస్తూ డ్రాలో పాల్గొనాలని ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News October 4, 2024
MLC ఓటర్ నమోదుపై రాజకీయ నాయకులతో సమావేశం
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై కరీంనగర్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓ మహేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితాపై సలహాలు, సూచనలు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.