News August 3, 2024

తిరుగులేని నగరంగా మారనున్న హైదరాబాద్!

image

HYD త్వరలో తిరుగులేని నగరంగా మారుతుందా అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. నగర శివారులో 200 ఎకరాల్లో AI సిటీ, 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హెల్త్ హబ్, ఫార్మా విలేజెస్, మూసి ప్రక్షాళన, 800 ఎకరాల్లో టెక్స్ టైల్ వెల్ స్పన్, 300 ఎకరాల్లో కైటెక్స్, 250 ఎకరాల్లో ఫాక్స్ కాన్, 15 ఎకరాల్లో ఒలెక్ట్రా లాంటి భారీ కంపెనీల ఏర్పాటు పూర్తైతే HYDకు తిరుగు లేదంటున్నారు.

Similar News

News October 31, 2025

డాక్టర్స్ స్పెషల్: ఎల్బీస్టేడియంలో టెన్నిస్ టోర్నమెంట్

image

ఎప్పుడూ రోగులు, వైద్యం అంటూ బిజీ బిజీగా ఉండే వైద్యులు ఈ వీకెండ్ సేదతీరనున్నారు. టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొని రిలాక్స్ కానున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు డాక్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డా.అర్జున్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు సందడి చేయనున్నారు. 

News October 31, 2025

HYD: రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరుగకుండా చర్యలు

image

పండగలు, ప్రత్యేక రోజుల్లో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఒక్కోసారి రద్దీ ఎక్కువై అదుపుతప్పి తొక్కిసలాట జరుగుతుంది. ఈ ప్రమాదాలు జరుగకుండా రైల్వే శాఖ కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు హోల్డింగ్ ఏరియాలను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే తోసుకోవడం, తొక్కిసలాట సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నారు.

News October 31, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి బీఆర్ఎస్ ‘మాట.. ముచ్చట’

image

జూబ్లీహిల్స్ ఎన్నికకు కేవలం 10 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ‘మాట.. ముచ్చట’ కార్యక్రమం జరుగనుంది. నియోజకవర్గంలో రద్దీ ప్రాంతాల్లో పార్టీ నాయకులు స్థానికులతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. నగర అభివృద్ధిపై మాట్లాడనున్నారు.