News April 2, 2025
తిరుతి జిల్లాలో ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో 164 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 26,967 మందికి 26, 615 మంది పరీక్షలు రాశారు. ప్రైవేట్ విద్యార్థులు 127 మందికి గాను 41 మంది రాకపోవడంతో 86 మంది పరీక్షలు రాశారని డీఈవో కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు పూర్తి చేశారు.
Similar News
News February 26, 2026
NCERT పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం

‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా లోతైన కుట్ర చేసినట్లు అనిపిస్తోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, NCERT ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించారు. విచారణ సందర్భంగా NCERT అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పింది.
News February 26, 2026
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 99 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 99 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో 52 కేసులు నమోదు కాగా, సెంట్రల్ జోన్‌లో 22, వెస్ట్ జోన్‌లో 8, ఈస్ట్ జోన్ పరిధిలో 17 కేసులు నమోదయ్యాయి.
News February 26, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.


