News July 30, 2024
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ సారె
తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ అరుణాచలం, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.
Similar News
News December 10, 2024
మదనపల్లె: కొడవలితో 10వ తరగతి విద్యార్థి హల్‌చల్
రాయచోటిలో విద్యార్థుల దాడిలో ఓ టీచర్ మృతిచెందిన ఘటన మరువక ముందే మదనపల్లెలో ఆ తరహా ఘటనే వెలుగు చూసింది. నీరుగట్టువారిపల్లెలోని ఓ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి బ్యాగులో సోమవారం కొడవలి దాచుకుని వెళ్లాడు. క్లాస్‌లోని తోటి విద్యార్థులకు కొడవలి చూపించడంతో వారు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన టీచర్లు, హెచ్ఎం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి విద్యార్థి పేరంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు.
News December 10, 2024
తిరుపతి కలెక్టర్‌కు 696 ఫిర్యాదులు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సోమవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. 32 సదస్సులలో సమస్యలపై 696 ఫిర్యాదులు అందినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగిలిన వాటిని సంబంధిత అధికారులు త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
News December 9, 2024
చంద్రగిరి: మహిళా అనుమానాస్పద మృతి
చంద్రగిరి మండలం ముంగిలపట్టులో కాసేపటి క్రితం ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఓ వ్యక్తితో కలిసి మహిళ ఏడుస్తూ కనిపించింది. చీకటి పడ్డాక నడి రోడ్డుపై రక్తపు మడుగులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.