News January 28, 2025

తిరుపతి:పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానం

image

పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహతి ఆడిటోరియంలో పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానం పై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు డా. ఎస్ వెంకటేశ్వర్, సుమిత్ కుమార్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

రహమత్‌నగర్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్

image

రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీ రామ్ నగర్‌లోని గవర్నమెంట్ ఆస్పత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన దృష్టికి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తీసుకెళ్లారు. ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీ ల్యాండ్, వాటర్ రిజర్వాయర్, స్టడీ సర్కిల్‌ని కూడా కలెక్టర్ సందర్శించారు.

News February 19, 2025

సంగారెడ్డి: చెరువులో మునిగి ఇద్దరు మృతి

image

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. చర్చి గాగిల్లపూర్‌కు చెందిన వల్లపు నరేష్(26) అతని స్నేహితుడు శంకర్(22) వావిలాల గ్రామంలోని పీర్ష చెరువులో ఈత కొట్టడానికి దిగగా చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 19, 2025

మెదక్: ఎన్నికల విధులపై కలెక్టరేట్లో సమీక్ష

image

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎన్నికల విధులు విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు.

error: Content is protected !!