News March 11, 2025

తిరుపతిలో అత్తను చంపిన అల్లుడి అరెస్ట్

image

తిరుపతి చిన్నగుంటలో ఈనెల 7న ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానికంగా ఉన్న గోపాల్ రెడ్డి భార్య ప్రమీల పాచిపనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె అల్లుడు రవీంద్ర నాయక్ మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మద్యాన్ని డబ్బులు ఇవ్వాలని ఆమెను కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ప్రమీలను కట్టేసి కాళ్లతో తన్ని గొంతు నులిమి హత్య చేశాడు. 

Similar News

News July 11, 2025

MDK: వర్షాల కోసం ఎదురుచూపులు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగాలు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులైనా సరైన వర్షాలు లేక అన్నదాత ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల తొలకరి జల్లులకు వేసిన పంటలు ఎండిపోతాయని కొందరు ఆవేదన చెందుతుండగా మరికొందరు వానదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 16.14 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు అంచనా వేయగా కేవలం 6.88 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

News July 11, 2025

గుంటూరు: రైస్ కార్డులకు దరఖాస్తుల వెల్లువ

image

రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్‌లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

News July 11, 2025

‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్ 5.27 గంటలు

image

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకే మూవీగా ‘బాహుబలి ది ఎపిక్’గా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్‌టైమ్‌ రివీలైంది. దాదాపు 5 గంటల 27నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈక్రమంలో దీనిపై ‘బాహుబలి’ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPL మ్యాచుకు సమానం’ అని రాసుకొచ్చింది.