News April 16, 2025
తిరుపతిలో అమానుష ఘటన

తిరుపతి రూరల్ మండలం బీటీఆర్ కాలనీలో ఓ వృద్ధుడు స్థానికంగా ఉంటున్న పిల్లలకు తన ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. నిన్న తన ఇంట్లో ముగ్గురు చిన్నారులకు వీడియోలు చూపిస్తుండగా స్థానికులు గమనించారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు మేస్త్రి పనులు చేసే సెల్వంగా గుర్తించి అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 19, 2025
HYD: మన బతుకమ్మ ఇంటర్నేషనల్ రేంజ్కు లోడింగ్

ఈ ఏడాది బతుకమ్మ వేడుక చరిత్రలోనే కీలక ఘట్టంగా SEP 28న ఎల్బీస్టేడియంలో ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపై 20,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు పర్యాటకశాఖ నడుం బిగించింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచపటం మీద నిలిపేందుకు, విదేశీ ఎయిర్లైన్ల నుంచి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణ. ఇదే జరిగితే బతుకమ్మ ప్రపంచస్థాయి పండుగగా గుర్తింపు పొందడం ఖాయం.
News September 19, 2025
వేములవాడ: ఈనెల 22 నుంచి శరన్నవరాత్రులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజులపాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గురువారం దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 29న ప్రత్యేక రథోత్సవం, సెప్టెంబర్ 30న గజవాహన సేవ, అక్టోబర్ 1న మహిషాసురమర్దిని అలంకారం, అక్టోబర్ 2న విజయదశమి నాడు శమిపూజ, అపరాజితాదేవీ ఆలయ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News September 19, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 24 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.