News January 24, 2025
తిరుపతిలో అమానుష ఘటన

తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News February 14, 2025
చిత్తూరు: ప్రేమికుల రోజే.. యువతి నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యం?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
తిరుపతి: కిరణ్ రాయల్‌పై కేసు నమోదు

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం ప్రకారం.. లక్ష్మీరెడ్డి గతంలోఎస్‌పీ హర్షవర్ధన్ రాజుకు కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారించి గురువారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News February 14, 2025
అలిపిరి నడక మార్గంలో చిరుత కదలికలు

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న విజిలెన్స్ అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. దీంతో భద్రత నడుమ భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.