News April 12, 2024

తిరుపతిలో ఇద్దరి ప్రాణం తీసిన ఓవర్ స్పీడ్

image

తిరుపతి-తిరుచానూరు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. తిరుచానూరు పంచాయతీ దామినేడు ఇందిరమ్మ గృహాల్లో ఉంటున్న అజయ్, బుజబుజనెల్లూరుకు చెందిన చైతన్య పనుల నిమిత్తం గురువారం తిరుపతిలోని లక్ష్మీపురానికి వచ్చారు. తిరిగి బైకుపై వెళ్తూ వేగంగా రోడ్డు పక్కనున్న ఇనుప దిమ్మెను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Similar News

News March 24, 2025

చిత్తూరు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం. వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉ.9 గం. కల్లా తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నియోజక వర్గ, మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు.

News March 23, 2025

చంద్రగిరి కోట అభివృద్ధికి గ్రహణం వీడేనా.?

image

ఉ.చిత్తూరు జిల్లా సిగలో మరో మణిహారం చంద్రగిరి కోట. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ కోట అలనాటి స్వర్ణయుగానికి ప్రతీక. శత్రు దుర్భేధ్యంగా నిర్మించిన బురుజులు, కోనేరు జిల్లాకే తలమానికం. కోటతోపాటూ అక్కడి మ్యాజియంలోని రాయలవారి వస్తువులను తిలకించడానికి ఎందరో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కోట అభివృద్ధికి అధికారులు మరిన్ని చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మీరేమంటారో కామెంట్ చేయండి.

News March 23, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.151 ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ రూ. 172గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. లేయర్ కోడి మాంసం కిలో రూ.145కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మీ సమీప ప్రాంతాలలోని చికెన్ దుకాణాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. 

error: Content is protected !!