News December 18, 2024
తిరుపతిలో కాకినాడ యువకుడి సూసైడ్

శంఖవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన యువకుడు తిరుపతి రూరల్ అవిలాలలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పి. రాజేశ్ జీవనోపాధికోసం తిరుమలకు వచ్చి ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువతిని ప్రేమించి ఆమెకు చెప్పాడు. ఆమె అంగీకరించలేదని మంగళవారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 28, 2026
ఈనెల 28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ: ఎంపీ

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.

News February 27, 2026
తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.